డిల్లి, డైనమిక్ డెస్క్,నవంబర్ 1
భారత ప్రభుత్వంలోని ప్రముఖ సంస్థ భారతీయ రైల్వే (Indian Railways) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టుల భర్తీకి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
దరఖాస్తుల తేదీలు
దరఖాస్తు ప్రక్రియ 2025 అక్టోబర్ 31 నుంచి ప్రారంభమైనాయి. అభ్యర్థులు రైల్వే అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తుల చివరి తేదీ 2025 నవంబర్ 30గా నిర్ణయించారు. ఫారమ్‌లో ఏదైనా తప్పు జరిగితే, డిసెంబర్ 3 నుంచి 12 వరకు సవరించుకునే అవకాశం ఉంటుంది.
అర్హతలు
అభ్యర్థులు సంబంధిత శాఖలో B.E./B.Tech డిగ్రీ లేదా కంప్యూటర్ సైన్స్/ITలో డిప్లొమా/డిగ్రీ కలిగి ఉండాలి.అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీతో గ్రాడ్యుయేషన్ చేసిన వారు కూడా అర్హులు.
వయోపరిమితి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు,గరిష్ట వయస్సు: 33 సంవత్సరాలు,(వయస్సు 2026 జనవరి 1 నాటికి లెక్కిస్తారు),రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం
ఎంపిక మొత్తం నాలుగు దశల్లో జరుగుతుంది , CBT-I (మొదటి దశ),మొత్తం 100 ప్రశ్నలు, సమయం 90 నిమిషాలు,గణితం, జనరల్ ఇంటెలిజెన్స్, సైన్స్, అవేర్‌నెస్ అంశాలు,నెగటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు తగ్గింపు
CBT-II (రెండో దశ)
మొత్తం 150 ప్రశ్నలు, సమయం 120 నిమిషాలు,టెక్నికల్ సబ్జెక్టులు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్, ఎన్విరాన్మెంట్, అవేర్‌నెస్,ఈ దశలో నెగటివ్ మార్కింగ్ ఉండదు,డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష (Medical Test) వుంటుంది
జీతం & సౌకర్యాలు
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹35,400 జీతం లభిస్తుంది. అదనంగా రైల్వే సిబ్బందికి డిఏ, టిఏ, వైద్య సదుపాయం, పెన్షన్ వంటి అనేక ప్రయోజనాలు కల్పించబడతాయి.
దరఖాస్తు రుసుము
జనరల్/OBC/EWS: ₹500,SC/ST/మహిళలు/వికలాంగులు: రుసుము మినహాయింపు,ఆన్‌లైన్ చెల్లింపు: డెబిట్/క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా
దరఖాస్తు విధానం
అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.inను సందర్శించండి, “Apply Online” లింక్‌పై క్లిక్ చేయండి, “New Registration” ఎంచుకొని వివరాలు నమోదు చేయండి, లాగిన్ అయి, ఫారమ్ పూరించండి రుసుము చెల్లించి, ఫారమ్‌ను సబ్మిట్ చేయండి,చివరగా ప్రింట్ కాపీని భద్రపరచుకోండి
ముఖ్య సూచన:
ఫారమ్‌ను సమర్పించే ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా తనిఖీ చేయాలని రైల్వే అధికారులు సూచించారు.ఇది “పెద్ద స్థాయిలో రైల్వే ఉద్యోగాల నియామకం” కావడంతో, పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఇది సువర్ణావకాశంగా మారనుంది.
