Monday, March 2, 2026
Homeతాజా సమాచారంజిల్లాలో తొలి బ్లైండ్ విద్యార్థుల డిజిటల్ లైబ్రరీ కార్నర్ ప్రారంభం సమాన విద్య అందరికీ అందుబాటులోకి...

జిల్లాలో తొలి బ్లైండ్ విద్యార్థుల డిజిటల్ లైబ్రరీ కార్నర్ ప్రారంభం సమాన విద్య అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం – చైర్మన్ ఎం.ఏ. ఆఫీజ్ ఖాన్

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 26

నల్గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బ్లైండ్ (దృష్టి లోపం ఉన్న) పాఠకులు, విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ లైబ్రరీ కార్నర్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఏ. ఆఫీజ్ ఖాన్ గురువారం ప్రారంభించారు. జిల్లాలో తొలిసారిగా ఈ సదుపాయం ప్రారంభించడం గర్వకారణమని ఆయన తెలిపారు.విద్య అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బ్లైండ్ విద్యార్థుల కోసం బ్రెయిలి పుస్తకాలు, ఆడియో బుక్స్, ఈ-బుక్స్, స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన కంప్యూటర్లు, ప్రత్యేకంగా చదువుకునే విభాగం, సహాయక సాంకేతిక పరికరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

2026–27 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం

అనంతరం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జిల్లా గ్రంథాలయ సంస్థ వార్షిక బడ్జెట్ సమావేశం చైర్మన్ అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సమావేశంలో వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు.బడ్జెట్ ద్వారా గ్రంథాలయాల అభివృద్ధి, పుస్తకాల కొనుగోలు, భవనాల మరమ్మతులు, డిజిటల్ లైబ్రరీ విస్తరణ, భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. అవసరమైన ప్రాంతాల్లో పబ్లిక్ రీడింగ్ సెంటర్లు ప్రారంభించనున్నట్లు చెప్పారు.గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు గ్రంథాలయ సెస్‌ను సకాలంలో చెల్లించాలని కోరారు. జిల్లాలోని ప్రతి గ్రంథాలయాన్ని సమగ్ర జ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి బాలమ్మ, అనిల్ కుమార్, కృష్ణ, మోహన్, నరసింహారెడ్డి తదితర గ్రంథాలయ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments