నేరేడుచర్ల, జనవరి 29, డైనమిక్ న్యూస్
నేరేడుచర్ల పురపాలక సంఘంలో జరుగుతున్న 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల స్వీకరణ కొనసాగింది.
వివిధ పార్టీల నుంచి నామినేషన్లు
గురువారం నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలోని 15 వార్డులకు గాను మొత్తం 37 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు తెలిపారు.
పార్టీల వారీగా నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి:
కాంగ్రెస్ పార్టీ (INC) – 17 నామినేషన్లు
భారత రాష్ట్ర సమితి (BRS) – 11 నామినేషన్లు
భారతీయ జనతా పార్టీ (BJP) – 05 నామినేషన్లు
తెలుగుదేశం పార్టీ (TDP) – 01 నామినేషన్
ఇండిపెండెంట్ అభ్యర్థులు – 02 నామినేషన్లు
రికగ్నైజ్డ్ పార్టీ – 01 నామినేషన్
నామినేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగింపు
నామినేషన్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేపట్టి, ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల స్వీకరణ కొనసాగుతున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు
