పాలకవీడు, డిసెంబర్ 10 (డైనమిక్ న్యూస్):
పాలకవీడు మండలంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయా గ్రామాల్లో ఏకగ్రీవ ఫలితాలు రావడంతో కాంగ్రెస్ పార్టీకి గట్టి బలం చేకూరింది.
ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లు వీరే:
గుడుగుంట్ల పాలేంం: మునగాల వరలక్ష్మి, రామనూజరెడ్డి
హన్మయ్యగూడెం: బాణోత్ మంగమ్మ, సోమ్లా నాయక్
మీగడం పహాడ్ తండా: భూక్యా చందూలు
కాంగ్రెస్ శిబిరంలో సంబరాలు
మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తింది. కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకుంటూ విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు.
నూతన సర్పంచ్‌లకు అభినందనలు
ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లకు పార్టీ నాయకులు
ఎన్.వి. సుబ్బారావు, భూక్యా గోపాల్ నాయక్, మాలోత్ మోతీలాల్ నాయక్, బైరెడ్డి జితేందర్ రెడ్డి, సప్పిడి నాగిరెడ్డి, మీసాల ఉపేందర్, మొహమ్మద్ ఖాసిం లు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజలకు కృతజ్ఞతలు
గ్రామాల్లో ఏకగ్రీవ ఫలితాలకు సహకరించిన ప్రజలకు నూతన సర్పంచ్‌లు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల నమ్మకానికి తగినట్లుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వారు హామీ ఇచ్చారు.


