నల్గొండబ్యూరో, డైనమిక్ న్యూస్ డిసెంబర్ 20
నల్గొండ జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు పలు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 23 న మంగళవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి యన్. పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాను ఐటీఐ క్యాంపస్, నల్గొండలో నిర్వహించనున్నట్లూ తెలిపారు
జీతభత్యాలు ఇలా
ఈ జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,000 నుండి రూ.25,000 వరకు జీతం చెల్లించనున్నట్లు తెలిపారు.
అర్హతలు ఇవే
SSC, ఇంటర్, డిగ్రీ చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.MS Officeపై బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.CRM పరిజ్ఞానం ఉన్న వారికి అదనపు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల స్త్రీ, పురుషులు అర్హులని వెల్లడించారు.
హాజరు విధానం
ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా / రెజ్యూమ్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, ఐటీఐ క్యాంపస్, నల్గొండ వద్ద హాజరు కావాలని సూచించారు.మరిన్నివివరాలకు సంప్రదించ వలసిన ఫోన్ నంబర్ : 7095612963
