కారంపూడి,డైనమిక్, నవంబర్9
కారంపూడి మండల కేంద్రంలోని పోలురెడ్డి టీ కొట్టు వద్ద ఆదివారం ఉదయం భారీ చింత చెట్టు ఆకస్మికంగా విరిగి రోడ్డుపై పడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆ సమయానికి రహదారిపై వాహనాలు తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది.చెట్టు విద్యుత్ తీగలపై పడే అవకాశం ఉండటంతో, స్థానికులు అప్రమత్తమై విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వెంటనే కరెంట్ సరఫరాను నిలిపివేయడం ద్వారా ప్రాణాపాయం తప్పించారు. ఈ ఘటనతో కొంతసమయం పాటు వ్యాపారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. త్వరగా చెట్టు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు
