Monday, March 2, 2026
Homeతాజా సమాచారంప్రజావాణి పిర్యాదులకు తక్షణ పరిష్కారం — కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశాలు

ప్రజావాణి పిర్యాదులకు తక్షణ పరిష్కారం — కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశాలు

సూర్యాపేట బ్యూరో, డైనమిక్, నవంబర్ 17

సూర్యాపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రజల నుండి పిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి పిర్యాదుపై అధికారులు అత్యవసరంగా స్పందించి త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు.

“వారం రోజుల్లో స్టేటస్ రిపోర్ట్ తప్పనిసరి”

కలెక్టర్ పవార్ మాట్లాడుతూ —

ప్రతి శాఖ అధికారి ప్రజావాణికి తప్పకుండా హాజరుకావాలి.శాఖల వారీగా పిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.వచ్చే వారం రోజుల్లో ప్రజావాణి పిర్యాదుల స్థితిపై రివ్యూ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.అలాగే కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులపై వెంటనే చర్యలు తీసుకొని తదుపరి వాయిదా నాటికి కౌంటర్ ఫైల్ సిద్ధం చేయాలని సూచించారు.

ప్రభుత్వ ఆస్తుల రికార్డులు అప్‌డేట్ చేయాలి

ప్రభుత్వ కార్యాలయాల కోసం స్థలం అవసరం ఉంటే వెంటనే తెలియజేయాలని, జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన భూముల వివరాలను రికార్డుల్లో నవీకరించాలని అధికారులు సూచనలు అందుకున్నారు.జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేయాలి.శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ పురోగతి నివేదికలను వెబ్ లింక్ ద్వారా నిరంతరం అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.

మాదక ద్రవ్యాల నిర్మూలన – విద్యాసంస్థల్లో ప్రతిజ్ఞ

నషా ముక్త భారత్ అభియాన్ లో భాగంగా మంగళవారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో, అలాగే గ్రామ స్థాయిలో మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా ప్రతిజ్ఞా కార్యక్రమం చేపట్టాలని అధికారులకు సూచించారు.

బాల్య వివాహాల రహిత తెలంగాణ పోస్టర్ ఆవిష్కరణ

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమం భాగంగా “బాల్య వివాహాలు రహిత తెలంగాణ” కోసం నిర్వహిస్తున్న 30 రోజుల ప్రత్యేక ప్రచారం (1 నవంబర్ – 1 డిసెంబర్ 2025) సందర్భంగా అవగాహన పోస్టర్‌ను కలెక్టర్ పవార్ ఆవిష్కరించారు. ఈ పోస్టర్లు చైల్డ్ మ్యారేజ్ నిర్మూలన, టోల్ ఫ్రీ నెంబర్‌పై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా విడుదలయ్యాయి.

ప్రజావాణిలో 42 పిర్యాదులు

సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 42 దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. వీటిలో భూసంబంధిత దరఖాస్తులు — 24,మున్సిపల్ కమిషనర్లకు — 4,ఇరిగేషన్ శాఖకు — 2,సోషల్ వెల్ఫేర్ శాఖకు — 2,ఇతర శాఖలకు — 10,ఈ దరఖాస్తులను సంబంధిత అధికారులకు పంపించి పరిష్కార చర్యలు ప్రారంభించినట్టు కలెక్టర్ తెలిపారు.

హాజరైన అధికారులు

ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, ఆర్డీఓ వేణు మాదవ్, మహిళా సంక్షేమ అధికారి కే. నర్సింహారావు, హౌజింగ్ పీడీ సిద్దార్థ, ఇరిగేషన్ అధికారులు, జడ్పీ డిప్యూటీ సీఈఓ శిరీష, డీఎస్సీడీఓ దయానంద రాణి, డీపీఓ యాదగిరి, డీఈఓ ఆశోక్, డీఐఈఓ బానునాయక్, డిఎంహెచ్ఓ వెంకట రమణ తదితర అధికారులు హాజరయ్యారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments