నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,నవంబర్16
నల్గొండలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన పత్రికా సమావేశంలో మాజీ జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కవితపై తీవ్ర స్థాయిలో స్పందించారు. హరీష్‌రావుపై చేస్తున్న వ్యాఖ్యలు అసత్య ప్రచారమేనని, ఇక మౌనం ఉండబోమని హెచ్చరించారు.
హరీష్‌రావుపై మాట్లాడే అర్హత కవితకు లేదు
నరేందర్ రెడ్డి మాట్లాడుతూ—
“హరీష్‌రావు రెండు వేల ఒకటవ సంవత్సరం నాటి తెలంగాణ ఉద్యమం నుంచి నిస్వార్థంగా పోరాడుతున్న నాయకుడు. అటువంటి నాయకుడి స్వభావంపై వ్యాఖ్యలు చేయడం కవిత పరిధిలోకి రాదు. నోరు అదుపులో పెట్టుకోవాలి” అన్నారు.
ఉద్యమ సమయానికి హరీష్‌రావు పోరాటం, కవిత విదేశాల్లో
ఉద్యమ పరిస్థితులను గుర్తుచేస్తూ—
“హరీష్‌రావు రోడ్లపై పోరాడుతుంటే, కవిత విదేశాల్లో చదువుకుంటూ ఉండేది. ఇప్పుడు ఒక్కసారిగా కాంగ్రెస్ మంచిదని, బీఆర్‌ఎస్ చెడ్డదని చెప్పడం ప్రజలను తప్పుదారిలో నడిపించేదే” అని వ్యాఖ్యానించారు.
ఎవరి చేతిలో బొమ్మగా మారిందో ప్రజలకు తెలుస్తోంది
కవిత ప్రవర్తన పార్టీకి నష్టం చేస్తోందని తెలిపారు.
“కెటిఆర్, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి వంటి నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మాట్లాడటం తగదు. ఇక ఎక్కడైనా అబద్దం మాట్లాడితే అక్కడికక్కడే మేము ప్రశ్నిస్తాం” అని హెచ్చరించారు.
కవిత మాటల్లో కాంగ్రెస్ స్వరం వినిపిస్తోంది
“కవిత మాట్లాడుతున్న మాటల్లో రేవంత్ రెడ్డి మాటలు వినిపిస్తున్నాయి.కాంగ్రెస్ ఆలోచన – కవిత ఆలోచన ఒకటే అవుతోంది.హరీష్‌రావును ఒంటరిచేయాలన్న కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది” అని నరేందర్ రెడ్డి ఆరోపించారు.
పార్టీని బలహీనపర్చే ప్రయత్నం ఇది
“హరీష్‌రావుపై అవినీతి మరకలు అంటించి పార్టీపై చెడు ప్రభావం కలిగించే ప్రయత్నం కవిత చేస్తోంది.బీఆర్‌ఎస్‌ను చీల్చడానికి ఇది పన్నిన వ్యూహం” అని అన్నారు.“కవిత ప్రవర్తనతో కేసీఆర్ ఆత్మ క్షోభిస్తుంది.ఆయనను బాధ పెట్టి నువ్వు ఏమి సాధిస్తావు?కేసీఆర్ రే తెలంగాణకు రక్షకుడు.బీఆర్‌ఎస్ తిరిగి ప్రజల ఆశీర్వాదం పొందుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయం అడ్డదారుల్లోనిదే
“జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అనుచిత పద్ధతులతో గెలిచింది.అది చూసి మేమెవరూ అధైర్యపడము.
కాంగ్రెస్ అనేది మోసం చేసే పార్టీ.
కవిత కాంగ్రెస్ మాయలో పడకండి,
నష్టపోయేది మీరే” అని పిలుపునిచ్చారు.
సమావేశంలో పాల్గొన్న వారు
ఈ పత్రికా సమావేశంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, మాజీ ఆర్‌వో మాలే శరణ్య రెడ్డి, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సాయిదిరెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కొండూరు సత్యనారాయణ, మైనం శ్రీనివాస్, దోటి శ్రీనివాస్, జమాల్ ఖాద్రి, అయితగోని యాదయ్య, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, బొజ్జ వెంకన్న, గుండెబోయిన జంగయ్య, ఊట్కూరు సందీప్ రెడ్డి, గంజి రాజేందర్, భీపంగి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
