డైనమిక్ న్యూస్, హుజూర్‌నగర్, ఏప్రిల్ 10
హుజూర్‌నగర్ బార్ అసోసియేషన్‌లో జరిగిన ఎన్నికల్లో కొణతం శ్రీనివాస రెడ్డి ప్యానెల్ నుంచి పోటీ చేసిన అడ్వకేట్ జక్కుల వీరయ్య విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు న్యాయవాదుల నుంచి విశేష మద్దతు లభించింది.
న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపిన వీరయ్య
విజయం అనంతరం అడ్వకేట్ జక్కుల వీరయ్య మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఓటు వేసిన ప్రతి న్యాయవాదికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయాన్ని అందరి సహకార ఫలితంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని హామీ
వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ, న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
