హైదరాబాద్, డైనమిక్ డెస్క్,అక్టోబర్ 27
కానిస్టేబుల్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన కేసులో నిందితుడైన రియాజ్‌పై జరిగిన పోలీసుల ఎన్‌కౌంటర్ ఘటనపై మానవ హక్కుల కమిషన్ (HRC) స్పందించింది. రియాజ్ తల్లి, భార్యలు కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై విచారణ ఆదేశాలు జారీ చేసింది.తెలంగాణ డీజీపీని ఈ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని HRC ఆదేశించింది. నవంబర్ 3లోగా వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని సూచించింది.పోలీసుల సమాచారం ప్రకారం— అరెస్టు అనంతరం రియాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు, కానిస్టేబుల్ వద్ద ఉన్న తుపాకిని లాక్కోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపారని పేర్కొన్నారు. అయితే కుటుంబసభ్యులు ఈ వాదనను తిరస్కరించి, ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు జరపాలని మానవ హక్కుల కమిషన్‌ను కోరారు.
