Tuesday, January 13, 2026
Homeఆంధ్ర ప్రదేశ్పల్నాటి వీరారాధన ఉత్సవాలు నూతనోత్తేజంతో రేపు ప్రారంభం మహాభారతాన్ని తలపించే పల్నాటి యుద్ధ ఘట్టాల స్మరణ

పల్నాటి వీరారాధన ఉత్సవాలు నూతనోత్తేజంతో రేపు ప్రారంభం మహాభారతాన్ని తలపించే పల్నాటి యుద్ధ ఘట్టాల స్మరణ

డైనమిక్ న్యూస్, నవంబర్ 18, కారంపూడి

పల్నాటి సీమ పౌరుషానికి ప్రతీక. ఒకప్పటి రణక్షేత్రమైన కార్యమపూడి—ప్రస్తుతం కారంపూడి—మళ్లీ వీరచార ఉత్సవాల సందడి కోసం సిద్దమవుతోంది. కార్తీక పౌర్ణమి నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు రేపు బుదవారం ఈ నెల 19 నుంచి 23 వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి.

కారంపూడి—రణభూమిని గుర్తు చేసే క్షేత్రం

11వ శతాబ్దంలో కారంపూడి నాగులేరు ఒడ్డున జరిగిన పల్నాటి యుద్ధం చరిత్రలో నిలిచిపోయిన ఘట్టం. ఆ యుద్ధంలో అమరులైన వీరులను స్మరించేందుకు స్థానికులు నిర్మించిన వీరుల దేవాలయం నేటికీ ఆ మహోన్నత గాధను స్మరింపజేస్తోంది. ఈ దేవాలయంలో జరిగే ఉత్సవాల నిర్వహణ బాధ్యత పిడుగు వంశానికి అప్పగించినట్లు చరిత్ర చెబుతుంది.

పౌరుషానికి ప్రతీక—పల్నాటి వీరచార ఉత్సవాలు

ప్రపంచంలో ఇటువంటి ఉత్సవాలు రోమ్ దేశంలో, భారతదేశంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలోని కారంపూడిలోనే జరుగుతాయి.రాచగావు, రాయబారం, మందపోరు, కోడిపోరు, కల్లిపాడు వంటి ఘట్టాలతో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.పల్నాటి యుద్ధం కార్తీక అమావాస్య నాటి నుంచి ఐదు రోజులపాటు జరిగినందున, నేటికీ ఆ రోజే ఉత్సవాలకు శ్రీకారం చుడతారు.

నాగమ్మ–బ్రహ్మనాయుడు రాగద్వేషాల ఫలితమే యుద్ధం

పల్నాటి యుద్ధానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, ముఖ్యంగా గురజాల నాయకురాలు నాగమ్మ మరియు మాచర్ల మంత్రిగా ఉన్న బ్రహ్మనాయుడు మధ్య రాజద్వేషాలు పెద్ద పీటవేశాయి.అలుగురాజు సంతానం నలగామరాజుకు గురజాల, మలిదేవులకు మాచర్ల రాజ్యాలు ఏర్పడటం తర్వాత ఈ వివాదాలు మరింత ముదిరాయి.కోడిపోరులో ఓడిపోయిన మాచర్ల రాజ్యాన్ని తిరిగి మలిదేవులకు అప్పగించాలనే చర్చల సందర్భంలో జరిగిన హత్యా ఘటన రాచరికాల మధ్య ఉద్రిక్తతను రెట్టింపు చేసింది.ఇది చివరకు పల్నాటి యుద్ధానికి దారితీసిందని చరిత్ర చెబుతుంది.

మతపోరు, దాయాదపోరు… పల్నాటి యుద్ధం పుట్టుక

వైష్ణవ మతాన్ని ప్రజల్లో విస్తరించిన బ్రహ్మనాయుడు, శైవమత ప్రబోధకురాలైన నాగమ్మ మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు తీవ్రమయ్యాయి.దీనితో పాటు గురజాల–మాచర్ల దాయాదుల మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి బాటలు వేశాయి.బ్రహ్మనాయుడు సమసమాజ స్థాపన కోసం దళితుడైన కన్నమదాసును దత్తపుత్రునిగా స్వీకరించడం కూడా ఆ కాలంలో పెద్ద సంచలనాన్ని రేకెత్తించింది.

వీరులను స్మరించే ఐదు రోజుల పండుగ

ప్రతి ఏటా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీరచారవంతులు కార్తీక అమావాస్య నాడు కారంపూడి చేరి ఐదు రోజుల పాటు పూర్వీకుల పౌరుషాన్ని స్మరించుకుంటారు.అలాటి పల్నాటి యుద్ధ ఘట్టాలను యథాతథంగా ప్రదర్శిస్తూ వీరచారవంతులు చేసే ప్రదర్శనలు ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

సారాంశం

దాయాదుల పోరు, మతపరమైన విభేదాలు, రాచరికాల మధ్య రాజద్వేషం… ఇదే పల్నాటి యుద్ధం పుట్టుక.ఆ వీరగాథను నేటికీ కొనసాగిస్తూ పల్నాటి వీరచార ఉత్సవాలు పౌరుషానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments