హైదరాబాద్,డైనమిక్ డెస్క్, అక్టోబర్ 21
తెలంగాణ మహిళలకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న ‘ఇందిరా మహిళా శక్తి’ పేరుతో ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.మొదట బతుకమ్మ కానుకగా అందించాల్సిన ఈ చీరల పంపిణీ, తయారీ ఆలస్యంతో వాయిదా పడింది. ప్రస్తుతం చీరల తయారీ పనులు వేగంగా సాగుతున్నాయి. నవంబర్ 15 నాటికి మొత్తం తయారీ పూర్తి చేసి, 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.మొత్తం 1.94 లక్షల మంది మహిళలకు ఈ ఉచిత చీరలు అందించనున్నారు. సిరిసిల్ల, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో నేసిన, ఒక్కొక్కటి సుమారు రూ.800 విలువ గల నాణ్యమైన చీరలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది.ఈ కార్యక్రమం ద్వారా మహిళా శక్తి, స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం సంకేతం ఇవ్వనుందని అధికారులు తెలిపారు.
