డైనమిక్,హైదారాబాద్
దీపావళి పర్వదినం ఈసారి ప్రత్యేక శోభతో రానుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, 500 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది అక్టోబర్ 20న అరుదైన వైభవ లక్ష్మీ రాజయోగం ఏర్పడనుంది.జ్యోతిష్యుల వివరాల ప్రకారం, ఆ రోజు చంద్రుడు, శుక్రుడు కన్యా రాశిలో సంయోగం చెందడం వల్ల ఈ ప్రత్యేక యోగం ఏర్పడుతోంది. ఈ యోగం ఆర్థిక, వ్యక్తిగత, వృత్తి పరమైన ప్రగతికి దారితీస్తుందని పండితులు చెబుతున్నారు.
🔹 కన్యా రాశి వారికి — వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త అవకాశాలు లభిస్తాయి.
🔹 మకర రాశి వారికి — అదృష్టం అనుకూలించి, పెండింగ్ పనులు సాఫీగా పూర్తవుతాయి.
🔹 కుంభ రాశి వారికి — ఆదాయం పెరిగి వ్యాపారాల్లో లాభాలు చేకూరే అవకాశం ఉంది.జ్యోతిష్య పండితులు ఈ రోజు లక్ష్మీ పూజ, దీపదానం చేస్తే ఆర్థిక శ్రేయస్సు, సంతోషం లభిస్తుందని సూచిస్తున్నారు
