డైనమిక్,నల్గొండ బ్యూరో , అక్టోబర్ 21
నల్గొండ బాలికల జూనియర్ కళాశాల NSS విద్యార్థులు మరియు స్టాఫ్ చెన్నూగూడెం గ్రామపంచాయతీ పరిధిలో శ్రామదానం చేశారు. NSS ప్రత్యేక శిబిరం భాగంగా విద్యార్థులు మంగళవారం చెన్నూగూడెం గ్రామానికి వచ్చి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.మొదటగా గ్రామంలోని పాఠశాల ఆవరణలో, పంచాయతీ కార్యాలయం వద్ద పిచ్చి మొక్కలు తొలగించి, పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం గ్రామంలో పచ్చదనం – పరిశుభ్రత, మాదకద్రవ్యాల వ్యసనం, బాల్య వివాహాలు, విద్య ప్రాముఖ్యత, ఆరోగ్యం వంటి అంశాలపై నినాదాలు ఇచ్చి ప్రజల్లో అవగాహన కల్పించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చెన్నూగూడెం మాజీ సర్పంచ్ శ్రీలత జంగయ్య యాదవ్ NSS శిబిరాన్ని ప్రారంభించి విద్యార్థులను ప్రోత్సహించారు. అనంతరం NSS విద్యార్థులు, ప్రోగ్రాం ఆఫీసర్లతో కలిసి గ్రామ ప్రజలతో కలిసి దీపావళి పండుగను ఆనందంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణి, భవిత ఇన్స్టిట్యూట్ వెంకట్ రెడ్డి, BED కాలేజీ ప్రిన్సిపాల్ జాఫర్, గౌతమి కాలేజీ మాథ్స్ లెక్చరర్ మధుసూదన్ రెడ్డి, రెగట్టే మల్లికార్జున్ రెడ్డి, NSS ప్రోగ్రాం ఆఫీసర్లు గోవర్ధన్, శ్వేత, రజిత, బిక్షపతి, స్వామి, శ్రీనివాస్, హనుమాన్ యూత్ అధ్యక్షులు నరేష్, యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పచ్చదనం – పరిశుభ్రతతో సమాజం ముందుకు సాగాలి అనే సందేశంతో NSS విద్యార్థుల సేవా కార్యక్రమం గ్రామంలో ప్రశంసలు పొందింది.
