Monday, March 2, 2026
Homeఆంధ్ర ప్రదేశ్ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీర్వాదం అందుకున్న గౌతమ్ రెడ్డి దంపతులు

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీర్వాదం అందుకున్న గౌతమ్ రెడ్డి దంపతులు

డైనమిక్,వెల్దుర్తి, అక్టోబర్ 27

మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పెద్ద కుమారుడు గౌతమ్ రెడ్డి, కోడలు తేజస్విని రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.స్థానిక టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం చంద్రబాబు, నవదంపతులను ఆశీర్వదించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం అశేషంగా తరలివచ్చిన శ్రేణుల జన సంద్రోహానికి అభివాదం చేసి, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి దంపతులను అభినందించారు.ఈ సందర్భంగా వేడుక ప్రాంగణం రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులతో కిక్కిరిసిపోయింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments