ఎపి,డైనమిక్, అక్టోబర్ 23
రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో సంస్కరణలు సమర్థవంతంగా అమలవ్వాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు.
పంచాయతీరాజ్ సంస్కరణలపై సమీక్ష
గురువారం మధ్యాహ్నం పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో సమావేశమై, గ్రామీణులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు సమీక్షించారు.
డి.డి.ఓ. కార్యాలయాలు ప్రారంభం
మంత్రివర్యులు ప్రకటించినట్లుగా, నవంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారులు (డి.డి.ఓ.) కార్యాలయాలు ప్రారంభం అవుతాయి.
13,351 గ్రామ పంచాయతీలు స్వతంత్ర యూనిట్లు
మాజీ క్లస్టర్ విధానం రద్దు చేసి, 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చడం ద్వారా పల్లెల్లో సేవా సౌలభ్యం పెరుగుతుందని మంత్రి తెలిపారు.
నిధులు సమకూర్చడంలో ప్రత్యేక దృష్టి
కనీస మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నిధులు సమకూర్చుతున్నామన్నారు.
ఆర్థిక స్వయం ప్రతిపత్తి కోసం కొత్త ప్రణాళికలు
15వ ఆర్థిక సంఘం నిధులతోపాటు, పంచాయతీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించేలా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
పల్లె పండగ 2.0
“పల్లె పండగ 2.0” కార్యక్రమం ద్వారా గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల పూర్తి ప్రణాళికను అందించాలని మంత్రి సూచించారు.
