Sunday, March 8, 2026
Homeతాజా సమాచారంసీసీ రోడ్డు శంకుస్థాపన – జ్యువెలరీ షాప్ ప్రారంభంరాఘవపురం ఎక్స్ రోడ్‌లో కీసర సంతోష్ రెడ్డి...

సీసీ రోడ్డు శంకుస్థాపన – జ్యువెలరీ షాప్ ప్రారంభంరాఘవపురం ఎక్స్ రోడ్‌లో కీసర సంతోష్ రెడ్డి కార్యక్రమాలు

డైనమిక్ న్యూస్, మోతే, మార్చి 8


మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆదివారం నిర్వహించారు. కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి ఉత్తమ్ పద్మావతి రెడ్డి మంజూరు చేసిన రూ.5 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

గ్రామంలోని ప్రజల రాకపోకలకు సౌలభ్యం కల్పించేందుకు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి మంజూరు చేసిన నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.

జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవం

అనంతరం అదే గ్రామంలో చిట్టెల నాగేశ్వరరావు ఏర్పాటు చేసిన జ్యువెలరీ షాప్‌ను కీసర సంతోష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.

నాయకులు, గ్రామస్తుల పాల్గొనిక

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోల లింగయ్య గౌడ్, ఉప సర్పంచ్ తాటికొండ సుజిత్ రెడ్డి, వార్డు సభ్యులు కారింగుల లింగమూర్తి గౌడ్, బట్టిపెల్లి సైదులు గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్, కోల కృష్ణ, కారింగుల సైదులు గౌడ్, కోల ఉపేందర్ గౌడ్, కోల అక్షయ్ గౌడ్, మర్రి సతీష్, తాటికొండ సోమిరెడ్డి, కన్మంత రెడ్డి వెంకట్ రెడ్డి, కోల రవి, కోల రవీందర్ గౌడ్ తదితర నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments