Tuesday, March 3, 2026
Homeతాజా సమాచారంపత్తేపురంలో అంబేద్కర్ కమిటీ హాల్ శంకుస్థాపన బాబాసాహెబ్ ఆశయాల సాధనలో ప్రతి యువకుడు ముందుండాలి –...

పత్తేపురంలో అంబేద్కర్ కమిటీ హాల్ శంకుస్థాపన బాబాసాహెబ్ ఆశయాల సాధనలో ప్రతి యువకుడు ముందుండాలి – మాజీ సర్పంచ్ మచ్చ పాపులు

నేరేడుచర్ల, డైనమిక్ ,అక్టోబర్ 28

పత్తేపురం గ్రామంలో అంబేద్కర్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ కమిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.

సమాజ చైతన్యానికి బాబాసాహెబ్ ఆదర్శం

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మచ్చ పాపులు ప్రధాన అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింహాలు తమ చరిత్రను తెలుసు కోలేనంత కాలం వేటగాడు చెప్పిందే చరిత్ర అవుతుంది.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజ చైతన్యం కోసం చేసిన కృషి అమూల్యం. ఆయన చూపిన మార్గంలో యువత ముందుకు సాగి సమాజ అభివృద్ధికి తోడ్పడాలి” అని పిలుపునిచ్చారు.

గ్రామస్థుల ఉత్సాహం, సభ్యుల సమన్వయం

అంబేద్కర్ కమిటీ సభ్యుల చొరవతో గ్రామ ప్రజల సహకారంతో హాల్ నిర్మాణం చేపట్టడం పట్ల హాజరైన అతిథులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో దారా వెంకటేష్, ఆరే పెద్ద సైదులు, ఆరే శ్రీకాంత్, మచ్చ కిరణ్, మచ్చ పెద్ద శ్రీను, వట్టేపు సుందరయ్య, రమేష్, నాగరాజు, శ్రీమోహన్, రాంబాబు, ఉపేందర్, జీవన్, శ్రీను, రమణ, మరియమ్మ, పద్మ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments