డైనమిక్,సూర్యాపేట బ్యూరో, అక్టోబర్ 21
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం జిల్లా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీసు ఫ్లాగ్ డే) ఘనంగా నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హాజరై జిల్లా ఎస్పీ నరసింహ్ తో కలిసి అమరుల స్మృతికి పుష్పగుచ్ఛాలతో నివాళులు ఘటించారు.
జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ మాట్లాడుతూ
పోలీసుల త్యాగాలను గుర్తుచేసి కృతజ్ఞత
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలో రోజురోజుకీ పోలీసు బాధ్యత పెరుగుతున్నదని, ప్రశాంత సమాజం పోలీసు త్యాగ ఫలితం అని పేర్కొన్నారు. 2015 ఏప్రిల్ 1న కొత్త బస్టాండ్ వద్ద ఉగ్రవాదుల దాడిలో అమరులైన కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేశ్వర్ కుటుంబాలకు 200 గజాల ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టా అందించారు. అమరుల కుమారుల చదువుకు కూడా ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.
ఎస్పీ నరసింహ మాట్లాడుతూ


శాంతిభద్రతల్లో పోలీసుల ప్రాణవంచన అని జిల్లా ఎస్పీ నరసింహ్ తెలిపారు. నిజామాబాద్ లో ఇటీవల అమరైన కానిస్టేబుల్ ప్రమోద్ కి నివాళి ఘటిస్తూ, శాంతిభద్రతల రక్షణలో పోలీసుల త్యాగాల ఫలితమే ప్రజలకు ప్రశాంత సమాజం లభించిందని” అన్నారు. రాత్రి, పగలు, వాతావరణాన్ని లెక్కచేయకుండా పోలీసులు భద్రత కల్పిస్తున్నారని, అమరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని చెప్పారు. స్మృతి పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు
స్మృతి పరేడ్ ఆర్ ఎస్ఐ అశోక్ కమాండర్‌గా నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి 191 మంది అమరుల పేర్లను స్మరించారు. పోలీసు కళాబృందం సాంస్కృతిక కార్యక్రమాలతో నివాళి ఘటించారు.ఫ్లాగ్ డే కార్యక్రమాలు అక్టోబర్ 31 వరకు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతాయని. సిబ్బంది మరియు ప్రజలు కలిసి అమరుల త్యాగాలను గుర్తుచేసి నివాళులు ఘటించమని సూచించారు.ఈ కార్యక్రమం నందు జిల్లా అధనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి,డి.ఎస్.పి ప్రసన్నకుమార్, డిఎస్పి
నర్సింహ చారి, డిఎస్పీ రవి, ఏ ఓ మంజు
భార్గవి, పోలీసు అమరవీరుల కుటుంబ
సభ్యులు, సిఐలు శివశంకర్, రాజశేఖర్,
నాగేశ్వరరావు, నరసింహారావు,
వెంకటయ్య, రామకృష్ణా రెడ్డి, ప్రతాప్,
అధ్యక్షులు రామచందర్ గౌడ్,
అర్ఎస్సైలు ఎం. అశోక్, కె అశోక్, సురేష్,
సాయిరాం, రాజశేఖర్, పోలీస్ సిబ్బంది
పాల్గొన్నారు
