హైదరాబాద్, నవంబర్ 10 (డైనమిక్ డెస్క్)
తెలుగు సాహిత్య ప్రపంచాన్ని దుఃఖంలో ముంచెత్తుతూ ప్రముఖ కవి, గేయరచయిత అందెశ్రీ (అందె శ్రీనివాస్) ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు సుమారు 73 సంవత్సరాలు.
ఇంట్లోనే కుప్పకూలిన అందెశ్రీ
వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉన్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. కుటుంబ సభ్యులు తక్షణమే స్పందించి ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వైద్యుల ప్రయత్నాలు విఫలమై ఆయన తుదిశ్వాస విడిచారు.
తెలుగు సాహిత్యానికి అందెశ్రీ అపార సేవ
తెలుగు భాష పట్ల అపారమైన ప్రేమతో అనేక అద్భుత గేయాలు, కవితలు రాసిన అందెశ్రీ, తెలుగు సాహిత్యానికి అచంచలమైన సేవ అందించారు. “జై తెలంగాణ” గీత రచయితగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన రచనల్లో తెలంగాణా స్ఫూర్తి, మాతృభూమి పట్ల ప్రేమ ప్రతిబింబంగా నిలిచాయి.
సాహిత్య రంగం శోకసంద్రం
అందెశ్రీ మరణం సాహిత్య, సినిమా, రాజకీయ రంగాలను తీవ్రంగా కలచివేసింది. పలువురు ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
