డైనమిక్ న్యూస్, సూర్యాపేటబ్యూరో, ఫిబ్రవరి 2
తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులముల స్టడీ సర్కిల్, సూర్యాపేట బ్రాంచిలో వివిధ పోటీ పరీక్షలకు నిర్వహించనున్న 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ ఫౌండేషన్ కోర్సు శిక్షణకు దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 22, 2026 వరకు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి దయానంద రాణి తెలిపారు.
అర్హతలు:
SC, ST, BC మరియు మైనారిటీ వర్గాలకు చెందిన డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ అభ్యర్థులు అర్హులు. తల్లిదండ్రుల/సంరక్షకుల వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండాలి.
శిక్షణ వివరాలు:
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగ్, రైల్వే, SSC తదితర పరీక్షలకు సిద్ధమయ్యేందుకు 5 నెలల పాటు ఉచిత వసతి, భోజనంతో కూడిన శిక్షణ ఇవ్వబడుతుంది.
ఎంట్రన్స్ పరీక్ష:
మార్చి 1, 2026 (ఆదివారం) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు సూర్యాపేటలో నిర్వహించబడుతుంది.
ఎంపిక విధానం:
మెరిట్ ఆధారంగా 100 మందిని ఎంపిక చేసి మార్చి 13 నుంచి ఆగస్టు 12, 2026 వరకు శిక్షణ అందిస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్ ద్వారా www.tsstudycircle.co.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.
సంప్రదించాల్సిన పోన్ నెంబర్ లు
మరిన్ని వివరాలకు 9032451108, 9704752077 నంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
