Tuesday, January 13, 2026
Homeతాజా సమాచారంక్రీడలతో ఉపాధి అవకాశాలు విస్తారంగా: ఎమ్మెల్సీ కోటిరెడ్డి

క్రీడలతో ఉపాధి అవకాశాలు విస్తారంగా: ఎమ్మెల్సీ కోటిరెడ్డి

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 23

టైం స్కూల్‌లో నల్లగొండ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన 69వ రాష్ట్రస్థాయి నెట్‌బాల్ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవానికి ఆదివారం ఎమ్మెల్సీ వై.ఎం.సి. కోటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

యువత క్రీడల్లో రాణించాలి – ఎమ్మెల్సీ కోటిరెడ్డి

ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో రాణించిన వారికి విద్యా, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. క్రీడలు మానసిక స్థైర్యాన్ని పెంచుతాయని, గెలుపు–ఓటములు సాధారణమని, ఓటమి తర్వాత శ్రమిస్తే విజయం తప్పదని సూచించారు.

నెట్‌బాల్ పోటీల్లో జిల్లా జట్ల దుమ్మురేపు

బాలుర విభాగం:
ప్రథమ స్థానం: ఖమ్మం
ద్వితీయ స్థానం: నల్లగొండ
తృతీయ స్థానం: మహబూబ్‌నగర్

బాలికల విభాగం:
ప్రథమ స్థానం: నల్లగొండ
ద్వితీయ స్థానం: ఖమ్మం
తృతీయ స్థానం: హైదరాబాద్
విజేతలకు ఎమ్మెల్సీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

ఎమ్మెల్సీకి ఘన సత్కారం

ఫెడరేషన్ నిర్వాహకులు మరియు టైం స్కూల్ యాజమాన్యం ఎమ్మెల్సీ కోటిరెడ్డిని శాలువాతో సత్కరించారు.

నిర్వాహకులు, పాల్గొన్నవారు

ఈ కార్యక్రమంలో ఎస్‌జి‌ఎఫ్ సెక్రటరీ డి.విమల, అబ్జర్వర్ కృష్ణ, కన్వీనర్ రమణ, పీడీలు, పి.ఈ.టి‌లు, టైం స్కూల్ ప్రతినిధులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments