డైనమిక్,పాలకీడు, అక్టోబర్ 18
తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బస్తీ బాట’ కార్యక్రమం భాగంగా పాలకీడు మండలంలోని 5వ వార్డు బొడ్రాయి బజార్‌లో శుక్రవారం బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు.
విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ పందిరి శ్రీనివాస్ మాట్లాడుతూ
“బస్తీలలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వెంటనే పరిష్కరించడం మా లక్ష్యం” అని అన్నారు. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, మీటర్ల లోపాలు, కనెక్షన్ సమస్యలను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ గుంటి పిచ్చయ్య, లైన్మెన్ పిడమర్తి వెంకటేశ్వర్లు తో పాటు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
