ఏపి డైనమిక్ డెస్క్,అక్టోబర్ 23
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రత పెరుగుతుందని, అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) ప్రకటించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.ఏపీలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.ఇక తెలంగాణలో కూడా వర్షాలు కొనసాగనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ సహా సుమారు 20 జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు జాగ్రత్తలు పాటించాలని IMD సూచించింది.
