డైనమిక్,వినుకొండ ,అక్టోబర్19
వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో డీఎస్సీ 2025లో విజయం సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో నియామకాలు పొందిన నూతన ఉపాధ్యాయులను ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు నూతన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.విద్యారంగ అభివృద్ధికి ఉపాధ్యాయుల సేవలు కీలకమని జీవీ ఆంజనేయులు అన్నారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని సూచించారు.నూతన టీచర్లను ప్రోత్సహిస్తూ వారికి శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
