డైనమిక్ న్యూస్, హుజూర్‌నగర్, జనవరి 30
గత మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలోని నాలుగో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దొంతి రెడ్డి పద్మ శుక్రవారం నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. హుజూర్‌నగర్‌లోని మంత్రి నివాసంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు.
గెలుపుకోసం ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి ఉత్తమ్
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ప్రజల కోసం స్వచ్ఛందంగా సేవ చేసే వారిని పార్టీ ఎల్లప్పుడూ గుర్తించి, అవసరమైన సమయంలో తగిన అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.రాబోయే ఎన్నికల్లో టికెట్ వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రతి కార్యకర్త సంపూర్ణ సహకారంతో పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ ఐక్యంగా కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మధిర ప్రతాప్ రెడ్డి, దాసు నాగేశ్వరరావు, నర్సింగ్ వెంకటేశ్వర్లు, దొంగరి వెంకటేశ్వర్లు, ఓరుగంటి నాగేశ్వరరావు, తేలుకుంట్ల వెంకటేశ్వర్లు, రాతికింది రాంబాబు, మాజీ ఎంపీపీ గూడెపు శ్రీను, రామారావు, శివ తదితర నాయకులు పాల్గొన్నారు.
