హైదరాబాద్,డైనమిక్ డెస్క్, అక్టోబర్ 20
దీపావళి పర్వదినం సందర్భంగా సోమవారం నగరంలోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ. హరీశ్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న హరీశ్‌రావును భక్తులు, స్థానిక నేతలు ఆహ్వానించి పూలమాలలతో స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.దీపావళి పర్వదినం సందర్భంగా ప్రజలకు హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. దేశం, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు.అలాగే చార్మినార్ పరిసరాల్లో దీపావళి ఉత్సాహం నిండిపోయింది. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
