నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 2
నారాయణపేట్ జిల్లా మక్తల్‌లో సీఎం పర్యటన బందోబస్తు విధుల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఉన్న పోలీసు సిబ్బంది కారుకు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్రంపోడు మండలం జీవ్వి గూడెం సమీపంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.
స్వల్ప గాయాలతో ముగ్గురు ఏఎస్ఐలు, ఒక హెడ్ కానిస్టేబుల్
ఈ ప్రమాదంలో ప్రయాణిస్తున్న ముగ్గురు ఏఎస్ఐలు, ఒక హెడ్ కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికుల సమాచారం మేరకు వారిని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స
గాయపడిన సిబ్బందికి నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన జిల్లా ఎస్పీ
ఈ మేరకు సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని గాయపడిన పోలీసు సిబ్బందిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుండి తెలుసుకుని, అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
