Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంనేరేడుచర్ల పోలీస్ స్టేషన్ తనిఖీకమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ నరసింహ

నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ తనిఖీకమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ నరసింహ

డైనమిక్,నేరేడుచర్ల, నవంబర్ 14

జిల్లాలో పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ నేరేడుచర్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ముందుగా సిబ్బంది గౌరవ వందనంతో స్వాగతం పలికారు. స్టేషన్ ప్రాంగణం, రికార్డులు, పరికరాలను పరిశీలించి సిబ్బంది క్రమశిక్షణపై అభినందనలు తెలిపారు. సమస్యలు అడిగి తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు.

సేఫ్ హుజూర్నగర్ సర్కిల్ ప్రాజెక్ట్ ప్రారంభం

సీసీ కెమెరాలు జిల్లా కమాండ్ సెంటర్‌కు అనుసంధానం, నేరేడుచర్ల స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను శుక్రవారం ప్రారంభించారు.

ఎస్పీ నరసింహ మాట్లాడుతూ

ఈ సెంటర్‌ను జిల్లా కేంద్రంతో అనుసంధా నించామని హుజూర్నగర్, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకవీడు, మఠంపల్లి ప్రాంతాల్లో ప్రతి స్టేషన్‌కు 50కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించారు.“ఒక్క సీసీ కెమెరా 100 మంది సిబ్బంది నేత్రాలంత శక్తివంతం” అని పేర్కొన్నారు నేరాల నిరోధం, అక్రమ రవాణా అరికట్టడంలో కెమెరాల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు.

అక్రమ వరి ధాన్యంపై కఠిన నిఘా

సన్న వరి ధాన్యానికి బోనస్ ఉండడంతో ఇతర రాష్ట్రాల నుండి అక్రమ రవాణా అవకాశం ఉందని ఎస్పీ వెల్లడించారు. జిల్లాలోని అన్ని సరిహద్దుల్లో 24 గంటల నిఘా ఏర్పాటు చేసి, అక్రమ ధాన్యం రాకుండా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.కేసుల దర్యాప్తు వేగం పెంచాలని,స్టేషన్ రికార్డులను పరిశీలించి,కేసులు పెండింగ్ లేకుండా వేగంగా దర్యాప్తు చేయాలీ,ఫిర్యాదులను వ్యవస్థగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలీ,కోర్టు విధులను పకడ్బందీగా నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు తక్షణ సేవలు అందిస్తే పోలీసులపై విశ్వాసం, గౌరవం పెరుగుతుందని తెలిపారు.

సైబర్ నేరాలు – రోడ్డు ప్రమాదాలపై చర్యలు

ప్రజల్లో సైబర్ మోసాలపై అవగాహన పెంచాలని, రోడ్డు ప్రమాదాలు తగ్గేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళల రక్షణ, విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

మూసీ ఘటనలో సేవలకు ఎస్ ఐ రవీందర్‌కు ఎస్పీ అభినందనలు

మూసీ నదిలో పడి మరణించిన బాలిక మృతదేహాన్ని వెలికితీసే సమయంలో చురుకుగా పనిచేసినందుకు నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్‌ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

అధికారుల పాల్గొనడం

కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు, నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్, డీసీఆర్‌బీ సిబ్బంది అంజనరెడ్డి, శేఖర్, సి సీ సందీప్, ఏఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments