Tuesday, March 3, 2026
Homeతాజా సమాచారంగుర్తు తెలియని మృతదేహం కలకలం ఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ నరసింహమృతదేహం వివరాల కోసం...

గుర్తు తెలియని మృతదేహం కలకలం ఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ నరసింహమృతదేహం వివరాల కోసం స్పెషల్ పోలీస్ టీమ్స్

సూర్యాపేట బ్యూరో, డైనమిక్, నవంబర్ 15

సూర్యాపేట రూరల్ పరిధిలోని టేకుమట్ల–ఖమ్మం జాతీయ రహదారిపై పిల్లలమర్రి శివారులో శనివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న వెంటనే సూర్యాపేట రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు.

స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

జిల్లా ఎస్పీ నరసింహ, సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరించేందుకు సంబంధిత అధికారులతో కలిసి సమగ్ర విచారణ చేపట్టారు. మృతదేహానికి సంబంధించి సూర్యాపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రత్యేక దర్యాప్తు బృందాల ఏర్పాటు

మృతుడి గుర్తింపు కోసం స్పెషల్ పోలీస్ టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది తో ఆధారాలను సేకరించారు. “ఈ మృతదేహాన్ని ఎక్కడైనా పడేశారా? లేదా మరోదైనా కారణమా?” అనే కోణాల్లో విచారణ సాగుతున్నదని ఎస్పీ తెలిపారు. త్వరలోనే నిజానిజాలు బయటపడతాయని చెప్పారు.సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాలు పనిచేస్తున్నాయి.

మృతదేహం ఆనవాళ్లు – పోలీసుల విజ్ఞప్తి

మృతుడు సుమారు 55 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి. తెల్లని గలచొక్కా, బ్లూ జీన్స్ ధరించి ఉన్నాడు.ఇలాంటి వ్యక్తి కనిపించకుండా పోయినట్లయితే లేదా వివరాలు తెలిసిన ఎవరైనా సూర్యాపేట రూరల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ (ఫోన్: 8712686006) ను సంప్రదించాలని ఎస్పీ నరసింహ  కోరారు.ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్నకుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, రూరల్ సిఐ రాజశేఖర్, ఎస్సై బాలు నాయక్, క్లూస్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments