సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 29
జిల్లాలో పోలీసు శాఖలో సుదీర్ఘకాలం సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులకు శనివారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపిఎస్ గారు పాల్గొని ఉద్యోగ విరమణ పొందిన పోలీసు సిబ్బందిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఉద్యోగవిరమణ పొందిన అధికారుల వివరాలు
ఉద్యోగవిరమణ పొందిన వారిలో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ: పులి వెంకటేశ్వర్లు,ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ: జానకిరాములు,డిసిఆర్బి ఏఎస్ఐ: కృష్ణా రెడ్డి,ఏఎస్ఐ: ఇస్మాయిల్ ఉన్నారు.వీరిలో పులి వెంకటేశ్వర్లు, కృష్ణా రెడ్డి, ఇస్మాయిల్ గార్లు స్వచ్ఛంద పదవి విరమణ చేసినట్లు అధికారులు తెలిపారు.పోలీసు సేవలు అభినందనీయం”
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ —
“సుదీర్ఘకాలం పోలీసు విభాగంలో సేవలు అందించడం గొప్ప విషయం. ప్రజా భద్రతే లక్ష్యంగా విధులు నిర్వహించడంలో మీరు చూపిన అంకితభావం అభినందనీయం” అని ప్రశంసించారు.
భార్యల సహకారం కూడా మరిచిపోలేం..
పోలీసు ఉద్యోగ విధులు కఠినమైనవి అని, ఈ ప్రయాణంలో కుటుంబ సభ్యుల ముఖ్యంగా భార్యల సహకారం అపారమని ఎస్పీ పేర్కొన్నారు.”ఇంటిని, పిల్లలను ప్రయోజకులను చేయడంలో భార్య పాత్ర కీలకమైనది. భర్త విధులు సజావుగా సాగేలా సహకరించిన వారి సేవలు మరువలేనివి” అని కొనియాడారు.
రిటైర్మెంట్ అంటే ముగింపు కాదు..
“రిటైర్మెంట్ అనేది వయస్సుకు సంబంధించినది కానీ మనసుకు కాదు. నచ్చిన పనిలో ముందుకెళ్లాలని, సమాజసేవలో పాల్గొనాలని” ఎస్పీ సూచించారు.
అదేవిధంగా ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో కాలం గడపాలని ఆకాంక్షించారు.
తోటి ఉద్యోగుల ప్రశంసలు
తోటి అధికారులు, సిబ్బంది మాట్లాడుతూ —
ఉద్యోగవిరమణ పొందిన అధికారులు విధుల పట్ల అంకితభావంతో పని చేశారని, సిబ్బంది, అధికారులతో సమన్వయంతో పనిచేసేవారని కొనియాడారు.
భావోద్వేగంతో స్పందించిన ఉద్యోగవిరమణ పొందిన అధికారులు
ఉద్యోగ విరమణ పొందిన వారు తమ ప్రసంగాల్లో —
తోటి ఉద్యోగుల, ఉన్నతాధికారుల మరియు కుటుంబ సభ్యుల సహకారంతోనే పోలీసు శాఖకు విలువైన సేవలు అందించ గలిగామని భావోద్వేగంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి: రవీందర్ రెడ్డి,ఏఆర్ అధనపు ఎస్పి: జనార్ధన్ రెడ్డి,ఏఆర్ డీఎస్పీ: నరసింహా చారి,అడ్మినిస్ట్రేషన్ అధికారి: మంజు భార్గవి,స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్: రామారావు,పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడు: యస్ ఐ రామచందర్,కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
