Monday, March 2, 2026
Homeతాజా సమాచారంపశువుల వ్యాధి నివారణ టీకాలపై జిల్లా అధికారి శ్రీనివాస్ రావు ఆకస్మిక తనిఖీ

పశువుల వ్యాధి నివారణ టీకాలపై జిల్లా అధికారి శ్రీనివాస్ రావు ఆకస్మిక తనిఖీ

నేరేడు చర్ల, నవంబర్ 4, డైనమిక్

నేరేడు చర్ల మండల పరిధిలోని నీమేడారం గ్రామంలో మంగళవారం నాడు పశువుల గాళికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం మండల డాక్టర్ నరేష్ కొనసాగుతున్న సందర్భంలో జిల్లా అధికారులైన డి. శ్రీనివాస్ రావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.టీకా కార్యక్రమం నిర్వహణ విధానాన్ని, పశువుల నమోదు ప్రక్రియను, టీకా సరఫరా, రికార్డు నిర్వహణ వంటి అంశాలను ఆయన పరిశీలించారు. గ్రామంలోని రైతులతో మాట్లాడి టీకా కార్యక్రమంపై వారి అభిప్రాయాలను సేకరించారు.జిల్లా అధికారి మాట్లాడుతూ, “పశువుల ఆరోగ్యం రైతు ఆర్థికాభివృద్ధికి మూలం. ప్రతి గ్రామంలోనూ ఈ టీకా కార్యక్రమం సమర్థవంతంగా అమలవ్వాలని” అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర భుజంగరావు, గోపాలమిత్ర సాయి కృష్ణ, అలాగే పెంచికల దిన్న గ్రామం నుండి వెటర్నరీ సిబ్బంది స్వప్న, వంశీ కృష్ణ పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments