డైనమిక్ న్యూస్, మార్చ్ 23, టేక్మల్
ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “సంఘటన సృజన్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా ఏఐసీసీ అబ్జర్వేటరీ కమిటీ తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా పర్యటించి కార్యకర్తల అభిప్రాయాలను సేకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీని ప్రకటించింది.
అశోక్ రెడ్డికి కీలక బాధ్యత
ఈ కమిటీలో టేక్మల్ మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పట్లోల్ల అశోక్ రెడ్డిని మెదక్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ సేవలందిస్తున్నారని నాయకులు పేర్కొన్నారు.
నాయకుల హర్షం
అశోక్ రెడ్డి నియామకంపై మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కృతజ్ఞతలు తెలిపిన అశోక్ రెడ్డి
తన నియామకానికి సహకరించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నిమ్మ రమేష్, సీనియర్ నాయకుడు మాన్ కిషన్ సహా అన్ని స్థాయి నాయకులకు అశోక్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
