నరసరావుపేట ,డైనమిక్,నవంబర్5
సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలానికి జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా బుధవారం పర్యటన చేశారు. ఈ సందర్భంగా మండల తహశీల్దార్ కార్యాలయం మరియు ఐసీడీఎస్ (ప్రాజెక్ట్) కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు మరింత శ్రద్ధ చూపించాలని, ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. అధికారుల హాజరు, రికార్డులు, సేవల అమలుపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజా సేవలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచనలు ఇచ్చారు.
