నేరేడు చర్ల,డైనమిక్, అక్టోబర్ 26
నేరేడుచర్ల పట్టణంలో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చల్లా శ్రీలత రెడ్డి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి వేడుకలను సందడిగా జరిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు కొణతం నాగిరెడ్డి, మండల అధ్యక్షుడు చితకుంట్ల రాజేష్ రెడ్డి, జిల్లా నాయకులు, పట్టణ, మండల స్థాయి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
