Wednesday, January 14, 2026
Homeతాజా సమాచారంఇందిర మహిళా శక్తి చీరల పంపిణీని విజయవంతం చేయాలి : సూర్యాపేట కలెక్టర్

ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీని విజయవంతం చేయాలి : సూర్యాపేట కలెక్టర్

సూర్యాపేటబ్యూరో, నవంబర్ 19 డైనమిక్ న్యూస్

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో “ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ” కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.

రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్

బుధవారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సహాచర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్‌లో చీరల పంపిణీపై సూచనలు జారీ అయ్యాయి. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు.

మహిళల ఆర్థిక శక్తీకరణకు ప్రభుత్వం విస్తృత చర్యలు

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ—

మహిళల ఆర్థిక ఉన్నతికి ప్రభుత్వం పెట్రోల్ బంకులు, సోలార్ యూనిట్లు, ఆర్‌టీసీ లీజ్ బస్సులు, వడ్డీ లేని రుణాలు, స్ట్రీనిధి రుణాలు, యూనిఫాం కుట్టే పనులు, అమ్మ ఆదర్శ పాఠశాల పనులు ఇలా అనేక అవకాశాలు కల్పిస్తున్నదని తెలిపారు.మహిళా సంఘాలు ఐక్యంగా పనిచేసి ఈ అవకాశాలను ఆదాయ మార్గాలుగా మలచుకోవాలని సూచించారు.ఇటీవలే జిల్లాలో 7,000 మంది కొత్తగా SHG లలో చేరారని, ఇంకా ఎవరైనా ఉండితే వారిని కూడా సంఘాల్లో చేర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.బ్యాంకులు, ఏపీఎం, వీఎఓ కార్యాలయాల్లో సమస్యలు వచ్చిన వెంటనే ఫిర్యాదు చేయాలని మహిళలకు సూచించారు.

చీరల పంపిణీ పారదర్శకంగా జరగాలి: సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చేసిన ముఖ్య వ్యాఖ్యలు:

ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మహిళలకు కోటి చీరలు పంపిణీ ప్రారంభించామని చెప్పారు.ప్రతి నియోజకవర్గానికి చీరల పంపిణీ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలి.మండల కేంద్రాలలో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పండగ వాతావరణంలో పంపిణీ జరగాలని సూచించారు.మహిళా సంఘాలకు ఇప్పటివరకు 27 వేల కోట్ల వడ్డీరహిత రుణాలు అందించామని తెలిపారు.ఉచిత బస్సు సౌకర్యం, మహిళలే నడిపే బస్సులు, యూనిఫాం కుట్టే పనులు, అమ్మ ఆదర్శ పాఠశాల పనులు, పెట్రోల్ బంకులు, సోలార్ యూనిట్లు, పాడి కొనుగోలు ద్వారా ఆదాయం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు.మహిళల ఉత్పత్తులకు ఆన్‌లైన్ మార్కెటింగ్ కోసం అమెజాన్‌తో చర్చలుకొనసాగుతున్నాయని చెప్పారు.జిల్లాల కలెక్టర్లు పూర్తి వివరాలతో పారదర్శకంగా చీరలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ 19 – డిసెంబర్ 9, పట్టణాలలో మార్చి 1 – 8 వరకు చీరల పంపిణీ జరుగుతుందని తెలిపారు.

జిల్లా అధికారుల హాజరు

వీడియో కాన్ఫరెన్స్‌‍లో అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, ఇంఛార్జి DRDO శిరీష, DPO యాదగిరి, అదనపు DRDO సురేష్, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా సమాఖ్య బాధ్యులు, మహిళా సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments