నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 19
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నల్గొండ జిల్లాలో సమర్థంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులపై ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సీఎం ఏ. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మాట్లాడారు.సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ — కీలక సూచనలు చేశారు.వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మహిళా శక్తికరణపై చేపడుతున్న ముఖ్య పథకాలను విశదీకరించారు.
సీఎం ముఖ్యాంశాలు
ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం,ఆడబిడ్డలకు సారె, చీర పెట్టడం తెలంగాణ సంప్రదాయం’’ అని ముఖ్యమంత్రి అన్నారు.అన్ని నియోజకవర్గాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశాలు,మండల కేంద్రాల్లో ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో పండగ వాతావరణంలో చీరల పంపిణీ చేయాలి,”మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి” అనే పేరుతో కార్యక్రమం నిర్వహణ,ప్రతి మహిళకు చీర పంపిణీ సమాచారం చేరేలా చర్యలు,మహిళా సంఘాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వ చర్యలు,సీఎం వివరించిన వివిధ మహిళా సంక్షేమ చర్యలు స్వయం సహాయక మహిళా సంఘాలకు 27 వేల కోట్ల వడ్డీలేని రుణాలు.ఉచిత బస్సు సౌకర్యం — బస్సుల నిర్వహణను మహిళా సంఘాలకే అప్పగింపు.స్కూల్ యూనిఫామ్ కుట్టే పనిని మహిళా సంఘాలకు అప్పగించడం ద్వారా 30 కోట్లు ఆదాయం.అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో 554 కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌లు మహిళా సంఘాలకు అప్పగించటం.మహిళా సంఘాలకు పెట్రోల్ పంపులు, సోలార్ యూనిట్లు ఏర్పాటు.పాడి కొనుగోలు ద్వారా 80 కోట్ల ఆదాయం కల్పింపు.ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు, శిల్పారామంలో 3 ఎకరాల్లో ఇందిర మహిళా శక్తి బజార్.ఆన్లైన్ మార్కెట్ కోసం అమెజాన్‌తో చర్చలు.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మహిళా ఉత్పత్తులకు గుర్తింపు కల్పించే చర్యలు.కోటి మహిళలను కోటీశ్వరులుగా మార్చడం లక్ష్యం.
చీరల పంపిణీ షెడ్యూల్
గ్రామీణ ప్రాంతాలు: నవంబర్ 19 నుండి డిసెంబర్ 9 వరకు పట్టణ ప్రాంతాలు: మార్చి 1 నుండి 8 వరకు పంపిణీ ప్రక్రియలో పారదర్శకత పాటించి ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా పనులను ముగించాలని సీఎం కలెక్టర్లకు ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ త్రిపాఠి మాట్లాడుతూ:
మహిళలు స్వయం సమృద్ధిగా ఎదగడానికి ప్రభుత్వం విస్తృత అవకాశాలు కల్పిస్తోందని అన్నారు.మహిళా సంఘాలు ఐక్యతతో పనిచేసి ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీని జిల్లాలో విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
హాజరైన అధికారులు
జిల్లా స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌కు
అదనపు కలెక్టర్ నారాయణ అమిత్,
డీ ఆర్ డీ ఓ శేఖర్ రెడ్డి,జిల్లా సమాఖ్య బాధ్యులు,
అనేక మహిళా సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.
