నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 24
మండల పరిధిలోని బూరుగుల తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పశువుల్లో నట్టల నివారణ చేపడితే జీవాలలో ఎదుగుదల గణనీయంగా పెరుగుతుందని బుదవారం పశువైద్యశాల అధికారి డా. నరేష్ తెలిపారు.
సర్పంచ్ మాలోతు నాగు నాయక్ చేతుల మీదుగా ప్రారంభం
గ్రామ సర్పంచ్ మాలోతు నాగు నాయక్ ఆధ్వర్యంలో నట్టల నివారణకు సంబంధించిన ఉచిత మందుల పంపిణీ కార్యక్రమంను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువులకు మందులు పంపిణీ చేసి రైతులకు అవగాహన కల్పించారు.
నట్టల సమస్య సాధారణమే – డా. నరేష్
ఈ సందర్భంగా డా. నరేష్ మాట్లాడుతూ, పశువుల్లో నట్టల బెడద సర్వసాధారణమని, ముఖ్యంగా నేలకు దగ్గరగా ఉన్న మేతను తినడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుందని తెలిపారు. నట్టలు పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీసి పాల ఉత్పత్తి, శారీరక ఎదుగుదలపై ప్రభావం చూపుతాయని వివరించారు.
గ్రామస్థుల పాల్గొనడం
ఈ కార్యక్రమంలో గ్రామంలోని వివిధ వార్డ్ నెంబర్ల సభ్యులు, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని వారు అభిప్రాయపడ్డారు.
