నేరేడుచర్ల , డిసెంబర్ 23, డైనమిక్ న్యూస్
పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నేరేడుచర్ల మండలంలోని పెంచికలదిన్నె గ్రామంలో మంగళవారం గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.
సర్పంచ్ చేతుల మీదుగా కార్యక్రమ ప్రారంభం
గ్రామ పంచాయతీ సర్పంచ్ నర్సింగు చిన్నసోములు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువుల ఆరోగ్యం మెరుగుపడేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు
పశువైద్యాధికారి నరేష్ పర్యవేక్షణ
ఈ కార్యక్రమం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో, పశువైద్యాధికారి డాక్టర్ జె. నరేష్ పర్యవేక్షణలో నిర్వహించబడింది. గ్రామంలో మొత్తం 1109 గొర్రెలకు, 194 మేకలకు నట్టల నివారణ మందులను త్రాపించడం జరిగింది.
పశుపోషకులకు అవగాహన
ఈ అవకాశాన్ని గ్రామంలోని గొర్రెలు, మేకల పెంపకదారులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ గారు పిలుపునిచ్చారు. పశువులకు నట్టల నివారణ చేయడం ద్వారా వ్యాధులు దూరమై, ఉత్పాదకత పెరుగుతుందని తెలిపారు
పశుసంవర్ధక శాఖ సిబ్బంది
హుస్సేన్,దుర్గాభవాని,స్వప్న,
వంశీకృష్ణ,విజయ్ కుమార్ తో పాటు శాఖకు చెందిన సిబ్బంది కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.
పాల్గొన్న ప్రజాప్రతినిధులు
ఈ కార్యక్రమంలో నర్సింగు చిన్నసోములు,
లచ్చయ్య,లింగయ్య,జి. నాగరాజు,
నాగరాజు,ఎం. నరేష్తదితరులు పాల్గొన్నారు.
