పాలకవీడు, నవంబర్ 24(డైనమిక్ న్యూస్)
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జానపహాడ్ గ్రామంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎమ్ఆర్ఎఫ్) ద్వారా మంజూరైన చెక్కులను మండల పార్టీ అధ్యక్షులు ఎన్.వి. సుబ్బారావు ఆదివారం లబ్ధిదారులకు అందజేశారు.
నాలుగు మంది పేద కుటుంబాలకు ఆర్థిక సాయం
ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు—
షేక్ లతీబా భర్త బాల సైదా,రామావత్ సక్రు తండ్రి బొజ్జ,కొమరబోయిన అచ్చమ్మ భర్త కాశయ్య,పేరూరి వీరబాబు తండ్రి సైదులుకు సీఎమ్ఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఆశీర్వాదం: సుబ్బారావు మండల పార్టీ అధ్యక్షుడు ఎన్.వి. సుబ్బారావు మాట్లాడుతూ
సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరమైంది. హాస్పిటళ్లలో అత్యవసర వైద్య చికిత్స పొందే పేదలకు ఇది గొప్ప ఆర్థిక సాయం అందిస్తోంది.” అని పేర్కొన్నారు.అలాగే లబ్ధిదారుల తరఫున మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జ్యోతి, సైదులు, నాగయ్య, శేషు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు
