Thursday, January 15, 2026
Homeఅమరావతిపెనుకొండలో 42 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ రూ.38 లక్షల విలువైన చెక్కులు...

పెనుకొండలో 42 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ రూ.38 లక్షల విలువైన చెక్కులు అందజేత – పేద, మధ్యతరగతి ప్రజల కోసం కూటమి ప్రభుత్వ కట్టుబాటు మంత్రి సవిత

పెనుకొండ, డైనమిక్,నవంబర్9

పెనుకొండ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 42 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) కింద రూ.38 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి సవిత పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా పెనుకొండ నియోజకవర్గ ఇంచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా హాజరయ్యారు.

వైద్య ఖర్చుల కోసం అప్పులు తీసుకోకూడదన్న సీఎం దృక్పథం

రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలు వైద్య చికిత్సల కోసం అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి రాకూడదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన మేరకు, కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సకాలంలో చెక్కులు, ఎల్వోసీలు అందజేస్తోందని మంత్రి సవిత తెలిపారు.

ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబాటు

ప్రజల ఆరోగ్య రక్షణలో ఎలాంటి రాజీ లేకుండా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ప్రతి అర్హులైన లబ్ధిదారుడికి సహాయం అందేలా చర్యలు తీసు కుంటున్నామనిఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments