టెక్మాల్, డైనమిక్ న్యూస్, మార్చి 7
అందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్ మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు మండలంలోని పలు గ్రామాలకు చెందిన 42 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 16,87,000 విలువైన చెక్కులు అందజేశారు.
ప్రజలకు అండగా ప్రభుత్వం
ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ అవసర సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తోందని తెలిపారు. లబ్ధిదారులు ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పాల్గొన్న ప్రజాప్రతినిధులు
కార్యక్రమానికి టేక్మాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మ రమేష్ అధ్యక్షత వహించగా, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ తిమ్మి సుధాకర్, తహసీల్దార్ తులసీరామ్ ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జోగిపేట్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సుబేదార్ మాణికిషన్, మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు షేక్ మజహర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఆశల సాగర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రాజేష్ గౌడ్, సంగమేశ్వర్, మాజీ వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆకులపల్లి పాపయ్య, ఎన్‌ఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి మహేష్ రెడ్డి, మాజీ డైరెక్టర్ పులి సత్యం తదితరులు పాల్గొన్నారు.అలాగే వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు విట్టల్ గౌడ్, మోహన్ తదితరులు హాజరయ్యారు.
