నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, నవంబర్ 23
పీఎంశ్రీ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్లతో పాటు మండల పరిధిలోని వివిధ ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇండ్లూరు వాస్తవ్యులు, అమెరికా షికాగోలో పనిచేస్తున్న శ్రీనివాస్–పద్మ దంపతులు సేవా కార్యక్రమంగా 300 మందికి పైగా విద్యార్థులకు దుస్తులను అందించారు.దాతలు పంపిన దుస్తులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టు మధు చేతుల మీదుగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేశారు.
సామాజిక అవగాహన కల్పించిన కళారూపాలు
ఈ కార్యక్రమంలో సామాజిక కళాకారులు బాదే నరసయ్య, డప్పు సతీష్ ద్వయం ప్రదర్శించిన పాటలు, కళారూపాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి.బాల కార్మికత్వ నిర్మూలన, గంజాయి–మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, డ్రగ్స్, సైబర్ నేరాలు, బాల్యవివాహాలపై అవగాహన కల్పిస్తూ వారు చేసిన ప్రదర్శనలు విద్యార్థుల్లో ప్రశంసలు అందుకున్నాయి.
కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు
కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం. సైదులు, ఆర్. శౌరి, ఎన్. వెంకటేశ్వర్లు, ఎం. మాధవి, ఎం. నాగమణి, భానుమతి, అన్నపూర్ణ పాల్గొన్నారు.ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వై. సత్యనారాయణ రెడ్డి, ఆర్. శ్రీనయ్య, అక్కయ్య బాబు, చందమల్ల వెంకన్న, శ్యామ్ మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
