డైనమిక్,లక్నో, అక్టోబర్ 18
భారత సైన్యం అమ్ములపొదిలో మరో శక్తివంతమైన ఆయుధం చేరింది. అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణుల తొలి విడతను యూపీ రాష్ట్రంలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్‌లో తయారు చేశారు. ఈ క్షిపణులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి అధికారికంగా అందజేశారు.
ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ–
“ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమే. దేశ భద్రతను విరోధించే ఏ ప్రయత్నానికైనా భారత సైన్యం ఊహించని విధంగా ప్రతిస్పందిస్తుంది” అని హెచ్చరించారు.యూపీ రాష్ట్రం రక్షణ పరిశ్రమ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతుందని, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ రూపకల్పనలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.దేశ భద్రతకు బలమైన ఆధారం అవనున్న బ్రహ్మోస్ క్షిపణులు, భూభాగం, సముద్రం, వాయు దళాల సామర్థ్యాన్ని మరింతగా పెంచనున్నాయని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
