హైదరాబాద్, డైనమిక్ డెస్క్, అక్టోబర్ 24
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ ప్రక్రియలో భాగంగా స్పీకర్ నేడు మరోసారి విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలపై క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి కాగా, ఈ రోజు నాలుగు కేసులపై విచారణ జరగనుంది.ఉదయం 11 గంటలకు కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టీ. ప్రకాష్ గౌడ్ కేసు విచారణ మొదలుకానుంది.మధ్యాహ్నం 12 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ కాలే యాదయ్య,మధ్యాహ్నం 2 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి,మధ్యాహ్నం 3 గంటలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేసులపై విచారణలు జరగనున్నాయి.ప్రతి కేసులో ఇరు వర్గాల నుంచి న్యాయవాదులు స్పీకర్ సమక్షంలో మౌఖిక వాదనలు వినిపించనున్నారు. ఫిరాయింపు కేసులపై తుది నిర్ణయానికి చేరుకోవడంపై ఆసక్తి నెలకొంది.

