హైదరాబాద్, డైనమిక్ డెస్క్, అక్టోబర్ 21
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు గడువు నేటితో ముగుస్తోంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నెల 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండగా, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. అదే నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు సమాచారం.
