Wednesday, January 14, 2026
Homeతాజా సమాచారంసిపిఐ వందవ వార్షికోత్సవాల జాత – నేరేడుచర్లలో ప్రారంభం జిల్లాలోనే తొలి కరపత్రం ఆవిష్కరణ –...

సిపిఐ వందవ వార్షికోత్సవాల జాత – నేరేడుచర్లలో ప్రారంభం జిల్లాలోనే తొలి కరపత్రం ఆవిష్కరణ – పార్టీ కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు ఖమ్మం సభ విజయవంతం చేయాలని పిలుపు

డైనమిక్ , నేరేడు చర్ల,నవంబర్‌ 2

సిపిఐ పార్టీ వందవ వార్షికోత్సవాల బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ప్రచార జాత సూర్యాపేట జిల్లాలో ఈనెల 20న నేరేడుచర్ల మండలం నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా జిల్లాలో తొలి కరపత్రాన్ని పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు.ఆదివారం నాడు నేరేడుచర్లలోని సిపిఐ కార్యాలయం ‘ప్రజా భవన్’లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో 100 సంవత్సరాల చరిత్ర గల ఏకైక పార్టీ సిపిఐ అని తెలిపారు. “1925 డిసెంబర్‌ 26న ఏర్పడిన తొలి కమ్యూనిస్టు సెల్‌ నుంచి నేటివరకు సిపిఐ ప్రజా ఉద్యమాలకు ముందుండి నాయకత్వం వహిస్తోంది. కార్మిక, కర్షక, మహిళ, విద్యార్థి, యువజన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతోంది,” అని ఆయన పేర్కొన్నారు.సంపూర్ణ స్వాతంత్ర్యానికి పిలుపునిచ్చిన ఏకైక పార్టీ సిపిఐ అని గర్వంగా చెప్పిన వెంకటేశ్వర్లు, “మహోన్నత పోరాట చరిత్ర సిపిఐ సొంతం, ప్రజల మన్ననలే పార్టీ బలం,” అని అన్నారు.

సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ధూళిపాళ ధనుంజయ నాయుడు మాట్లాడుతూ

“అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సంక్షేమమే సిపిఐ ధ్యేయం. కొన్ని పార్టీలు అధికారానికి పరిమితమైతే, సిపిఐ మాత్రం సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల కోసం నిరంతరం పోరాడుతోంది,” అన్నారు.అతను మరోసారి పునరుద్ఘాటిస్తూ, “భారతదేశంలో అనేక పార్టీలు పుట్టి పోయినా, సిపిఐ మాత్రమే అన్ని రాష్ట్రాల్లో నిలకడగా పనిచేస్తోంది. ప్రజల హృదయాలలో ఎర్రజెండా ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. భూమి, ఆకాశం ఉన్నంతకాలం, ఆకలి ఉన్నంతకాలం – పోరాటం ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీ సజీవంగానే ఉంటుంది,” అని ధనుంజయ నాయుడు అన్నారు.కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్, శివ, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments