డైనమిక్, మార్టూరు అక్టోబర్ 18
బాపట్ల జిల్లా మార్టూరు మండలం పరిధిలోని జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై నుండి మంగళగిరి వైపు వెళ్తున్న కంటైనర్ వాహనానికి టైరు పగిలి నియంత్రణ కోల్పోవడంతో డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో డీజిల్ ట్యాంకు పగిలి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.సమీపంలో ఉన్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే చిలకలూరిపేట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు తక్షణమే అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే కంటైనర్ పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
