Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంవరంగల్‌లో మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మాణం శరవేగంగా! భద్రకాళి ఆలయం సమీపంలో రూ.20 కోట్ల వ్యయంతో...

వరంగల్‌లో మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మాణం శరవేగంగా! భద్రకాళి ఆలయం సమీపంలో రూ.20 కోట్ల వ్యయంతో 5 అంతస్తుల భవనం – 600 కార్ల పార్కింగ్ సదుపాయం

డైనమిక్,వరంగల్, నవంబర్ 06

వరంగల్ నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీకి శాశ్వత పరిష్కారంగా మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. భద్రకాళి ఆలయం ఎదురుగా ఉన్న 3 ఎకరాల భూమిలో రూ.20 కోట్ల వ్యయంతో ఆధునిక సదుపాయాలతో కూడిన 5 అంతస్తుల మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మించనున్నారు.

600 కార్లకు స్థానం

ఈ పార్కింగ్ కాంప్లెక్స్‌లో ఒకేసారి సుమారు 600 కార్లు నిలిపే సౌకర్యం కల్పించనున్నారు. వరంగల్ నగర కేంద్ర ప్రాంతంలో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉండటంతో, ఈ ప్రాజెక్టు పూర్తయితే నగర రవాణా వ్యవస్థకు బాగా ఊరట కలగనుంది.

హైదరాబాద్ నమూనాలో ప్రాజెక్టు

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ సమీపంలో ఇప్పటికే ఇలాంటి మల్టీ లెవల్ పార్కింగ్ విజయవంతంగా పనిచేస్తోంది. అదే నమూనాలో వరంగల్‌లో కూడా ఈ సదుపాయం ఏర్పాటు చేయనున్నారు.

కేడీఏ ఆధ్వర్యంలో పనులు

ఈ ప్రాజెక్టును కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KUDA) పర్యవేక్షిస్తోంది. అవసరమైన డిజైన్‌లు, టెండర్ ప్రక్రియలు పూర్తి దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments