Friday, February 6, 2026
Homeతాజా సమాచారంనేరేడుచర్లలో క్లీన్ స్వీప్ లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం15కి 15 గెలుపే నిజమైన విజయం: మంత్రి ఉత్తమ్...

నేరేడుచర్లలో క్లీన్ స్వీప్ లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం15కి 15 గెలుపే నిజమైన విజయం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

నేరేడుచర్ల, ఫిబ్రవరి 5, డైనమిక్ న్యూస్

నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల్లో 15 వార్డులకు గాను 15 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటేనే దానిని నిజమైన గెలుపుగా భావించాల్సి ఉంటుందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆకస్మికంగా నేరేడు చర్ల కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమై మాట్లాడారు కేవలం 10 వార్డులు గెలిచి మున్సిపల్ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం పెద్ద విషయం కాదని, అది సంపూర్ణ విజయం కాదని వ్యాఖ్యానించారు. ప్రజల సంపూర్ణ మద్దతు ప్రతిబింబించేలా అన్ని వార్డుల్లో కాంగ్రెస్ గెలవాలని ఆయన పిలుపునిచ్చారు.

క్లీన్ స్వీప్ే లక్ష్యం

హుజూర్‌నగర్‌లో 28 వార్డులు, కోదాడలో 35 వార్డులు, నేరేడుచర్లలో 15 వార్డులు – ఈ మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ విజయం సాధించడమే తన లక్ష్యమని మంత్రి తెలిపారు. ప్రతి వార్డులోనూ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సర్వేల్లో కాంగ్రెస్‌కే ఆధిక్యం

నేరేడుచర్లలో తానే స్వయంగా సర్వే చేయించానని, ఆ సర్వేల్లో 15కి 15 వార్డులు కాంగ్రెస్ గెలుస్తుందని స్పష్టమైన సంకేతాలు లభించాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని, ఇది ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలిస్తుందని అన్నారు.

అభివృద్ధి పనులపై ఫోకస్

గత రెండేళ్ల కాలంలో ప్రజలకు గుర్తుండిపోయేలా అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి గుర్తుచేశారు. రోడ్లు, తాగునీరు, మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలులో స్పష్టమైన మార్పు వచ్చిందన్నారు.

ఫండ్స్ మరింత రావాలంటే సంపూర్ణ గెలుపు అవసరం

నేరేడుచర్లలో మరింత అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు అవసరమని, అవి రావాలంటే అన్ని వార్డుల్లో కాంగ్రెస్ గెలవాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తేనే నేరేడుచర్లను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లగలమని అన్నారు.

కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం

విభేదాలు పక్కనపెట్టి ప్రతి కార్యకర్త ఒకే లక్ష్యంతో పని చేయాలని, ఇంటింటి ప్రచారం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని మంత్రి సూచించారు.నేరేడుచర్లలో 15కి 15 వార్డులు గెలవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, అదే నిజమైన విజయం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ అధ్యక్షులు కొణతం చిన్న వెంకట్ రెడ్డి, నూకల సందీప్ రెడ్డి,సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments